సోదరుడి దగ్గర ఆశీస్సులు తీసుకున్న రజనీకాంత్..

సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు తన రాజకీయ ప్రవేశం గురించి ప్రకటన చేసాడు. డిసెంబ‌ర్ 31న పార్టీ ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా చెప్పిన ర‌జ‌నీ జ‌న‌వ‌రిలో పార్టీ లాంచింగ్ కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని తెలిపాడు. స్వయంగా రజని ప్రకటించడం తో అభిమానుల సంబరాలు మాములు గా లేవు.

అయితే రాజ‌కీయాల‌లోకి వెళుతున్న సంద‌ర్భంగా రజని బెంగ‌ళూరులో ఉన్న త‌న సోద‌రుడు స‌త్య‌నారాయ‌ణ ఆశీస్సులు తీసుకున్నారు. సత్యనారాయ‌ణ..ర‌జ‌నీకి శాలువా క‌ప్పి బెస్ట్ విషెస్ అందించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.