బ్యాలెట్ బాక్సుల్లో చెదలు, నీరు…!

bellot
ఇటీవల కురిసిన భారీ వర్షానికి బ్యాలెట్ బాక్సులో వర్షపు నీరు చేరడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని పది బ్యాలెట్ బాక్సుల్లో వర్షపు నీరు చేరడంతో ఓట్ల లెక్కింపులో ప్రతిష్ఠంభన ఏర్పడింది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని వీఎస్ లక్ష్మీ కళాశాల కేంద్రంలో భద్రపరిచిన 6 బ్యాలెట్ బాక్సుల్లో వర్షపు నీరు చేరింది. గొల్లలమామిడాడ జడ్పీటీసీ బ్యాలెట్ బాక్సులో నీరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తడిసిన బ్యాలెట్ పత్రాలను పరిశీలిస్తున్నారు.

ఇక, నెల్లూరు జిల్లా కావలిలోని జవహర్ భారతి కళాశాలలో భద్ర పరిచిన బ్యాలెట్ బ్యాక్సులకు చెదలు పట్టాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా బ్యాలెట్ పత్రాలకు చెదలు పట్టి చిరిగిపోయి ఉండటాన్ని గుర్తించిన ఏజెంట్లు అభ్యంతరం తెలిపారు. బ్యాలెట్ బాక్సులను, పత్రాలను పరిశీలించిన ఆర్డీవో కె.వి.రమణారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చారు. కలెక్టర్ ఆదేశాల మేరకు దీనిపై రిటర్నింగ్ అధికారి తుది నిర్ణయం తీసుకోనున్నారు. జడ్పిటిసి,ఎమ్.పిటిసి ఎన్నికలు బ్యాలెట్ పత్రం ఆధారంగా జరిగిన సంగతి తెలిసిందే.