రాష్ట్రాల్లోనూ లోకాయుక్తా ఏర్పాటు చేయాలి: రాహుల్

rahulలోక్ పాల్ తరహాలో రాష్ట్రాల్లోనూ లోకాయుక్త ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత వుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు . కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులతో సమావేశం ఆనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. 2014 ఫిబ్రవరి 28 నాటికి అన్ని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లోక్ పాల్ తరహాలో లోకాయుక్తను ఏర్పాటు చేయాలని ని తెలిపారు. లోక్ పాల్ బిల్లు కోసం అన్ని రాష్ట్రాలు మద్దతివ్వాలని ఆయన కోరారు. ఈ విషయంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రుల సమావేశంలో నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడానికి ప్రణాళికలు రచించాలని నిర్ణయించామని రాహుల్ తెలిపారు. నిత్యావసర సరుకులు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీనికి తోడు అవినీతిని అరికట్టడంపై చర్చించామని వెల్లడించారు. అవినీతిపై అన్ని పార్టీలు ఐకమత్యంతో పోరాడాల్సిన అవసరం ఉందని గా రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.