దేశాభివృద్ధిలో పారిశ్రామికవేత్తల పాత్ర కీలకం : రాహుల్

Rahul-gandhiకాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు (గురువారం) సీఐఐ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. భారత శక్తిని ప్రపంచానికి చాటేవారిలో పారిశ్రామిక వేత్తలు ముందున్నారని అన్నారు. దేశాభివృద్ధి లో పారిశ్రామిక వేత్తల పాత్ర కీలకమైందని ఆయన అన్నారు. అయితే, గత కొన్నేళ్లుగా పారిశ్రామిక రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని.. ప్రజలకు మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యత పారిశ్రామిక రంగంపై కూడా ఉందని రాహుల్ పేర్కొన్నారు.

సమాజంలో విభజన రాజకీయాల వల్ల దేశపురోగతికి ఆటంకం కలుగుతుందని, యూపీఏ పాలనలో దేశం వేగంగా పురోగతి సాధించిందని ఆయన పేర్కొన్నారు. దేశం త్వరగా అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటే.. బలహీన వర్గాలు, మహిళలు.. అందరినీ కలుపుకొంటూ ముందుకు సాగలని ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగం సమస్య కాదని, నైపుణ్యాల లేమి నిరుద్యోగ సమస్యకు ప్రధాన కారణమవుతోందని రాహుల్ అభిప్రాయపడ్డారు.