Site icon TeluguMirchi.com

ఎంపీ రఘురామపై అనర్హత వేటు..?

గత కొన్ని రోజులుగా ఎంపీ రఘురామ ఎపిసోడ్ వైసీపీ పార్టీ లో చర్చ గా మారింది. రోజు రోజుకు ఈయన లొల్లి ఎక్కువ అవుతుండడం తో ఆ పార్టీ ఎంపీలు రఘురామపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అనర్హత వేటు వేయాలని కోరే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆయన కూడా స్పందించారు. ప్రపంచమంతా ఏకమైనా తన పదవిని ఎవరూ ఏమీ చేయలేరన్నారు.

తన మీద జరుగుతున్న కుట్రల గురించి జగన్‌కు తెలియదు అనుకున్నానని.. కానీ విమానం ఏర్పాటు చేశారంటే తన మీద కుట్రలు జగన్‌కు తెలిసే జరుగుతున్నాయి అనుకుంటున్నాను అన్నారు. పార్టీపై మమకారం ఉందని.. తనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే పద్దతి అది కాదని.. తనకు సరైన పద్దతిలో షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం ఇస్తాను అని తేల్చి చెప్పాడు.

Exit mobile version