ఈ రోజు పాములపర్తి వెంకటనరసింహారావు గారి 97 వ జయంతి. ఇంతకీ పాములపర్తి వెంకటనరసింహారావు గారు ఎవరు అనుకుంటున్నారా, మన ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రము నుంచి ఎన్నికైన మొట్టమొదటి ప్రధాని పీవీ నరసింహారావు ( పీవీ అంటే “పాములపర్తి” )
నేడు ఆయన జయంతిని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాలను నిర్వహించనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఆయనకు నివాళులు అర్పించి , తెలంగాణ ప్రాంతం నుంచి ప్రధానిగా ఎన్నికవ్వడం తెలుగు ప్రజల గర్వ కారణమని కొనియాడారు . ఆయన సేవలను స్మరించుకున్నారు .
ఆర్థిక సంస్కరణలకు ఊతం ఇచ్చి, భారత దేశాన్ని ప్రగతిపధంలో నడిపించిన తెలంగాణ ముద్దుబిడ్డ , బహుభాషా కోవిదుడు అంటూ పీవీ నరసింహారావు గారికి ట్విటర్ వేదికగా మంత్రి కేటీఆర్ నివాళులు అర్పించారు. అటు పీవీ నరసింహారావు గారి స్వస్థలం ( లక్నేపల్లి ) వంగరలో జయంతి వేడుకలు కుటుంబ సభ్యులు జరుపుతున్నారు.
Former Prime Minister Late Sri PV Narasimha Rao Garu was a reformist of our economic policy, versatile & proud son of Telangana? pic.twitter.com/CIQqodyPQt
— KTR (@KTRTRS) June 28, 2018