పాపం..పువ్వాడ ఇలా బుక్కయ్యాడేంటి..?

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఏ వేడుకలు లేకుండా అయిపోయాయి. పుట్టిన రోజులు లేవు , పెళ్లి రోజులు లేవు..ఆఖరికి చనిపోయిన బంధువులెవ్వరు చివరి చూపు లేదు..అంత దారుణం అయ్యింది కవర్ణ వల్ల. ఇలాంటి ఈ సమయంలో మంత్రి పువ్వాడ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం వివాదానికి దారి తీసింది.

మంత్రి మీద అభిమానంతో ఆ శాఖ సిబ్బంది సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చారు. సడన్ గా కేక్ తీసుకొచ్చి కట్ చేయమని టేబుల్ మీద పెట్టారు. జనాలకి ఓ మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో కరోనా వైరస్ ని పోలినట్టు కేక్ తయారు చేయించారు ఆ సిబ్బంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ వీడియో సోషల్ మీడియాలోకి ఎక్కడంతో అసలు రచ్చ మొదలైంది. కరోనా కష్టకాలంలో మంత్రిగారికి పుట్టినరోజు వేడుకలు కావాల్సి వచ్చాయా అంటూ కొంతమంది విమర్శిస్తే..అసలు కరోనా కాలంలో కేక్ ఎలా తయారు చేశారు, ముందు ఆ బేకరీ సంగతి తేల్చండి అంటూ మరికొంతమంది కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. సోషల్ మీడియా లో ఈ లొల్లి ఎక్కువ అవడం తో చివరకు ఈ వ్యవహారం కేసీఆర్ దగ్గరకు చేరింది. వెంటనే మంత్రికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారట కేసీఆర్. కరోనాపై అవగాహన కల్పించేందుకే అలాంటి కేక్ కట్ చేశామని, పుట్టినరోజు జరుపుకోవాలని తాను అనుకోలేదని వివరణ ఇచ్చుకున్నారట మంత్రి అజయ్. మొత్తం మీద పుట్టిన రోజు రచ్చ రోజు గా అయ్యిందని మంత్రి ఫీల్ అయ్యాడట.