టీడీపీ పార్టీ సీనియర్ నేత దారుణ హత్య

గుంటూరు జిల్లాలో టీడీపీ పార్టీ సీనియర్ నేత దారుణ హత్య కు గురికావడం సంచలనంగా మారింది. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచి, టీడీపీ పార్టీ సీనియర్ నేత పురంశెట్టి అంకులును గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. కత్తులతో పొడిచి, మెడకోసి మరీ విచక్షణరహితంగా హత్య చేసారు.

దాచేపల్లి సితార రెస్టారెంట్ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ లో ఈ ఘటన చోటు చేసుకుంది. అంకులును పంచాయితీ కోసమని పిలిచి ప్రత్యర్థులు గొంతు కోసి చంపినట్లు తెలుస్తోంది. పెదగార్లపాడు గ్రామంలో పురంశెట్టి అంకులు తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్‌గా 15 సంవత్సరాల పాటు సేవలందించారు. ఇంతటి సీనియర్ నాయకుడు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా సంచలనం రేపుతోంది.