Pulse Polio : పల్స్ పోలియో పై అవగాహనా ర్యాలీ


పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ.ఎస్.దినేష్ కుమార్ అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంగోలులో పల్స్ పోలియో అవగాహనా ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రాజధాని సెంటర్ మీదుగా రిమ్స్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో పలు కళాశాలల విద్యార్దులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదు సంవత్సరాల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు.