Site icon TeluguMirchi.com

పబ్లిక్ టాయిలెట్లని కూడా వదలని దుండగులు

గ్రేటర్ హైదరాబాద్ లో నగరవాసుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్లలోని పైప్ లు, నల్లాలు, వాటర్ ట్యాంకర్లు, కమ్మోడ్ లు, ఫ్లష్ డోర్ లను దుండగులు చోరి చేస్తున్నారు. తద్వారా సదుద్దేశంతో ప్రారంభించిన ఈ పబ్లిక్ టాయిలెట్లలో కొన్ని నిరుపయోగంగా ఉంటున్నాయి. దీనితో పబ్లిక్ టాయిలెట్లలోని పరికరాలను చోరి చేసేవారిని గుర్తించి వారిపై తగు కేసులు నమోదు చేయాలని క్షేత్రాధికారులను జిహెచ్ఎంసి ఆదేశించింది. దీనితో పాటు  చోరికి గురైన పరికరాలను వెంటనే అమర్చి వాటిని ఉపయోగంలోకి తేవాలని పేర్కొన్నారు. తమ పరిధిలోని పబ్లిక్ టాయిలెట్లన్నింటిని ప్రతి రోజు పలు మార్లు శుభ్రపర్చాలని సంబంధిత సర్కిల్ లోని  మెడికల్ అధికారులు, డి.ఇ లు, ఏ.ఇలు , జవాన్లు, ఎస్.ఎఫ్.ఏ లు నిరంతరం పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణఫై పర్యవేక్షణ జరపాలని కోరారు. ప్రతిరోజు ఈ టాయిలెట్లను ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7గంటల వరకు తెరిచి ఉండేలా సంబంధిత నిర్వహణ ఏజెన్సీలను ఆదేశించారు.

Exit mobile version