లోక్‌సభ ఎన్నికల తర్వాతే అసెంబ్లీ ఎన్నికలు: పీటీఐ

eleactionsరాష్ట్ర విభజన జరిగిపోయిన నేపధ్యంలో ఎన్నికల నిర్వహణ ఉమ్మడి రాష్ట్రంలో జరుగుతాయా ? లేదా సీమాంధ్ర, తెలంగాణ లో వేరువేరుగా జరుగుతాయా ? అన్నదానిపై ఇప్పుడు చర్చజరుగుతోంది. ఈ ఎన్నికలకు సంభదించి పీటీఐ ఓ కధనం వెల్లడించింది. రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు సీమాంధ్ర, తెలంగాణ అసెంబ్లీలకు ఎన్నికల నిర్వహణ అనుమానమేనని పీటీఐ తన వార్తాకథనంలో పేర్కొంది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై కేంద్రాన్ని సంప్రదించి ఈసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు పీటీఐ తన కధనం లో తెలిపింది.