తాజ్‌మహల్ బాకీ పడిన ఇంటి పన్నును చెల్లించాల్సిందిగా భారత పురావస్తు విభాగానికి ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. బకాయి పడ్డ రూ.88,784(వడ్డీ రూ.47,943)ను 15 రోజుల్లో చెల్లించాలని గడువు విధించింది. ఇలా నోటీసు జారీ చేయడం ఈ శతాబ్దంలోనే మొదటిసారి. తాజ్‌కి పక్కనే ఉన్న మరో కట్టడం ఇతిమద్-ఉద్-దౌలాకు పన్ను నోటీసులు అందాయి.