Site icon TeluguMirchi.com

దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత..


ప్రాజెక్ట్‌ చీతాలో భాగంగా నమీబియా నుంచి గతేడాది భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. ‘‘శుభాకాంక్షలు, వన్యప్రాణుల సంరక్షణలో చారిత్రాత్మకమైన క్షణం. గతేడాది సెప్టెంబరు 17న నమీబియా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చీతాల్లో ఒకటి నాలుగు కూనలకు జన్మనిచ్చింది’’ అని వీడియో/ఫొటోను మంత్రి ట్విటర్‌లో షేర్ చేశారు. అంతేకాదు ప్రాజెక్ట్ చీతా బృందాన్ని అభినందిస్తున్నాను అన్నారు. దీంతో దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత భారత్‌ గడ్డపై చీతాలు జన్మించడం విశేషం.

Exit mobile version