Site icon TeluguMirchi.com

జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దుకు సిఫారసు..!

SyedAhmedజార్ఖండ్‌ లో రాష్ట్రపతి పాలన ఉపసంహరించుకోవాలని.. ఆ రాష్ట్ర గవర్నర్ గవర్నర్ సయ్యద్ అహ్మద్‌ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ప్రభుత్వఏర్పాటుకు అనుమతించాల్సిందిగా.. నిన్న శాసనసభాపక్ష నేత హేమంత్ సోరెన్ గవర్నర్ ను కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. రాష్ట్రపతి పాలన రద్దు విషయంలో కేంద్రానికి గవర్నర్ సిపారసు చేసినట్లు తెలుస్తోంది. అయితే, రాష్ట్రంలో ప్రభ్వుత్వ ఏర్పాటు జేఎంఎంతో కాంగ్రెస్ ఓ ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, జేఎంఎంకు భాజపా మద్ధతు ఉపసంహరించుకోవడంతో.. జార్ఖండ్ లో కేంద్రప్రభుత్వం గత జనవరి 18 నుంచి రాష్ట్రపతి పాలనను విధించిన విషయం తెలిసిందే. జులై 18న జార్ఖండ్ లో రాష్ట్రపతిపాలన ముగియనుంది.

Exit mobile version