రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ఆమోదం!!

President-rule-in-APరాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. దీంతో.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు కానుంది. 1973లో ఆంధ్రప్రదేశ్ లో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను విధించిన విషయం తెలిసిందే. నిన్న (శుక్రవారం) సమావేశమయిన కేంద్ర కేబినేట్ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది. కాగా, రాష్ట్రపతి నుంచి గవర్నర్ కు ఉత్తర్వులు అందగానే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు కానుంది. ఇప్పటి వరకు దేశంలో 122 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. తాజాగా, ఏపీలో రాష్ట్రపతి పాలనతో దేశంలో 123 సార్లు రాష్ట్రపతి పాలన విధించినట్లయింది.