Site icon TeluguMirchi.com

రాష్ట్రపతి పాలనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

president-rule(1)రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకే కేంద్రం మొగ్గుచూపింది. ఈ మేరకు ఈ ఉదయం జరుగుతున్న కేంద్ర కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేబినేట్ నిర్ణయాన్ని రాష్ట్రపతి ఆమోదించడమే తరవాయి.. ఏపీ గవర్నర్ పాలన ప్రారంభమవుతుంది. కేబినేట్ సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్రపతి పాలనపై అధికారిక ప్రకటన చేయనున్నారు. 41సంవత్సరాల తరవాత రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతోంది. పీవి. నరసింహారావు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో 1973లో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. దీనికి జై ఆంధ్రా ఉద్యమం కారణమైంది.

Exit mobile version