మరో ఐదుగురికి గురి..!

pranab-mukherjeeరాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఘోరమైన నేరాలకు పాల్పడిన ఏడుగురిలో ఐదుగురు దోషులకు క్షమాభిక్షను నిరాకరించారు. మరో ఇద్దరి మరణశిక్షను జీవితఖైదుగా తగ్గించారు. గతంలో కసబ్, అఫ్జల్ గురు క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన విషయం తెలిసిందే. దాంతో వారిద్దరికి మరణ శిక్ష అమలు జరిగింది. ప్రస్తుతం ఐదు క్షమాభిక్ష పిటిషన్లను ప్రణబ్ తోసిపుచ్చడంతో.. ఇక అటువంటి పిటిషన్లు రాష్ర్టపతి వద్ద పెండింగులో లేవని తెలుస్తోంది. కేంద్ర హోంశాఖ సిఫారసులకు అనుగుణంగా రాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, అత్యధిక క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించిన ఏకైక ర్రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ముఖర్జీనే.

రాష్ర్టపతి తోసిపుచ్చిన క్షమాభిక్ష పిటిషన్ల వివరాలు :

  • • హర్యానాకు చెందిన ధర్మపాల్ 1993లో బాలికపై అత్యాచారం చేయడమే కాకుండా బాలిక కుటుంబ సభ్యులు ఐదుగురిని కిరాతకంగా హత్య చేశాడు. హర్యానా మాజీ ఎమ్మెల్యే కూతురైన సోనియా తన భర్తతో కలిసి 2001లో హిసార్ ప్రాంతంలో తల్లిదండ్రులు సహా తన కుటుంబ సభ్యులు 8మందిని హత్య చేశారు.
  • • ఉత్తరాఖండ్ కు చెందిన సుందర్ సింగ్, అత్యాచారం, హత్య కేసులో దోషిగా ఉన్నాడు.
  • • 2002లో ఉత్తరప్రదేశ్ కు చెందిన జఫర్ అలీ తన భార్య, ఐదుగురు కూతర్లను కర్కోటకంగా హత్య చేశాడు.
  • • ఉత్తరప్రదేశ్ కు చెందిన గుర్మీత్ సింగ్ 1986తో ఒకే కుటుంబానికి చెందిన 13 మందిని దారుణంగా హత్య చేశాడు.
  • • 1994లో కర్ణాటకు చెందిన ప్రవీణ్ కుమార్ ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశాడు.