Site icon TeluguMirchi.com

గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు


ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొడానికి నేడు ఢిల్లీ వస్తున్నారు. ఈ నెల 26 వరకు ఆయన భారత్‌లో పర్యటిస్తారు. భారతదేశ 74వ గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయనతో పాటు ఐదుగురు మంత్రులు, సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా భారత్ కు వస్తున్నారు.

గణతంత్ర దినోత్సవానికి ఈజిప్టు అధ్యక్షుడిని ముఖ్య అతిథిగా ఆహ్వానించడం ఇదే తొలిసారి. రిపబ్లిక్ డే పరేడ్‌లో ఈజిప్టు ఆర్మీకి చెందిన సైనిక బృందం కూడా పాల్గొంటుంది. ఈజిప్టు అధ్యక్షుడు రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం అవుతారు. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలను వారు చర్చిస్తారు. 1950 నుంచి భారత్‌ మిత్ర దేశాల నేతలను గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది.

Exit mobile version