ప్రపంచం గొప్ప యోధుణ్ని కోల్పోయింది: ప్రణబ్

pranab
నెల్సన్ మండేలా మహాత్మా గాంధీ స్ఫూర్తితో ప్రజల్లో చైతన్యాన్ని తెచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ . సౌతాఫ్రికాలోని జోహెన్నెస్ బర్గ్ లో మండేలా సంతాప సభలో పాల్గొన్న ప్రణబ్ ముఖర్జీ మాట్లాడారు. మండేలా ఈ శతాబ్ధపు త్యాగధనుడు అంటూ కీర్తించారు. ప్రపంచ చరిత్రలో మండేలా తెలివైన నేత అని ప్రణబ్ వివరించారు. గాంధీ సత్యాగ్రహ విధానం వల్ల మండేలా స్ఫూర్తి పొందారని తెలిపిన ప్రణబ్, భారత్ సందర్శనకు వస్తే సొంతింటికి వచ్చినట్టు ఉంటుందని చెప్పేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రపంచం గొప్ప యోధుడ్ని కోల్పోయిందన్నారు.

ఆ ఆరుగురిలో ప్రణబ్ ఒకరు !

జోహోన్నెస్ బర్గ్ లో జరుగుతున్న నెల్సన్ మండేలా సంతాప సభలో ప్రపంచ దేశాలకు చెందిన వంద మంది దేశాధినేతలు పాల్గొన్నారు. అయితే అందులో ప్రసంగించే అవకాశం మాత్రం ఆరుగురు మాత్రమే దక్కించుకున్నారు. వారిలో ఐక్య రాజ్యసమితి ప్రధాన కార్యదర్వి బాన్ కి మూన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాలు కీలకోపన్యాసాలు చేయగా, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రో, భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, చైనా, బ్రెజిల్, నమీబియా దేశాధి నేతలకు మాత్రమే మండేలా స్మారక ప్రసంగం చేసే అవకాశం దక్కింది.