Site icon TeluguMirchi.com

‘అత్యాచార నిరోధక బిల్లు’కు రాష్ట్రపతి ఆమోదం !

Anti-rape-Billఢిల్లీ సామూహిక అత్యాచారం నేపధ్యంలో.. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన “అత్యాచార నిరోధక బిల్లు”కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈరోజు (బుధవారం) అత్యాచార నిరోధక బిల్లుపై సంతకం చేయటంతో ఈ చట్టం నేటి నుంచి అమల్లోకి వస్తోంది. సవరణల అనంతరం రాష్ర్టపతి ఆమోదంతో.. తాజాగా అమలోనికి వచ్చిన అత్యాచార నిరోధక బిల్లును నేరచట్ట(సవరణ) బిల్లు -2013గా పిలుస్తున్నారు. నేరచట్ట(సవరణ) బిల్లు -2013 పేరుతో రూపొందించిన ఈ బిల్లు ప్రకారం అత్యాచార నేరాలను పునరావృతం చేసేవారికి, దారుణమైన అత్యాచారాలకు పాల్పడేవారికి జీవితకాలమంతా (చనిపోయేంతవరకు) జైలు శిక్ష, లేదా మరణశిక్ష విధించవచ్చు. ఇతర లైంగిక దాడుల కేసుల్లో నిందితులకు 20 సంవత్సరాల వరకు శిక్ష విధించే వీలుంది.

Exit mobile version