భారత్ మరో సరికొత్త క్షిపణిని పరీక్షించింది. సర్ఫేస్ టూ సర్ఫేస్ ప్రయోగించే ‘ప్రళయ్’ క్షిపణిని రక్షణ రంగ పరిశోధన సంస్థ డీఆర్‌డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ఐలాండ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ క్షిపణి 150 కిమీ- 500 కిమీ మధ్య లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. మొబైల్ లాంఛర్‌పై క్షిపణి గమన నిర్దేశిత వ్యవస్థ సాయంతో ప్రయోగించే అవకాశం ఉన్నట్లు డీఆర్‌డీవో పేర్కొంది. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో, శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు.