Site icon TeluguMirchi.com

కేటీఆర్ కు హ్యాట్సాఫ్ చెప్పిన ప్రకాష్ రాజ్ ..

లాక్ డౌన్ కారణంగా జనజీవనం ఎక్కడిక్కడే ఆగిపోయింది. వలస కార్మికుల తిప్పలు అన్ని ఇన్ని కావు..రీసెంట్ గా లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం వలస కార్మికుల కోసం ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం తో వారంతా ఊరట చెందుతున్నారు.

ఈ క్రమంలో విలక్షణ నటుడు ప్రకాష్‌ రాజ్‌ కూడా వలస కార్మికుల కోసం తనవంతు సాయాన్ని అందించారు. ప్రకాష్‌ రాజ్‌ ఫౌండేషన్‌ ద్వారా అనేక మంది వలసకార్మికులకు తన వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రయం అందించి వారి ఆలనా పాలనా చూసుకున్నారు.

కాగా వలస కార్మికులను వాళ్ల స్వస్థలాకు పంపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, రామగుండం, దామరచర్ల తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపుతున్నారు. బీహార్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలకు రోజుకు 40 చొప్పున ప్రత్యేక రైళ్లను నడుపుతూ వలస కార్మికులను తరలిస్తున్నారు. దీంతో ప్రకాష్‌ రాజ్‌ ఫామ్‌హౌజ్‌లో ఉన్న వలస కార్మికులు కూడా వారి స్వస్థలాలకు బయలుదేరారు.

‘వలస శ్రామికులను సురక్షితంగా తరలిస్తున్నందుకు కేటీఆర్ గారికి, తెలంగాణ డీజీపీ గారికి కృతజ్ఞతలు. 44 రోజుల పాటు కొంతమంది కూలీలకు నా ఫామ్‌హౌస్‌లో ఆశ్రయం ఇచ్చాను. వాళ్లందరూ ఇప్పుడు తనను వదిలిపెట్టి వెళ్లిపోతున్నారు. వారి జీవిత కథల నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. కష్టకాలంలో వారిని ఆదుకోగలిగిన ఒక తోటి వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. వాళ్లకు ఆశ్రయం ఇవ్వడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది’ అంటూ ప్రకాష్‌ రాజ్‌ ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ప్రకాష్‌ రాజ్ తన ఫామ్‌హౌస్‌లో ‌ వారందరిని ప్రత్యేక బస్సుల ద్వారా రైల్వేస్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫోటోలను కూడా ట్వీట్‌లో పోస్ట్ చేసారు.

Exit mobile version