విజయవాడ లోని స్వర్ణప్యాలెస్ ప్రమాదంలో 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతుల కుటుంబాలను ఆదుకుంటామన్న ప్రభుత్వం..అన్నట్లు గానే ఈరోజు వారికీ ఆర్ధిక సాయం చేసింది. మంత్రులు ఆళ్లనాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మట్లాడుతూ.. రమేష్ ఆస్పత్రి బాధ్యతారాహిత్యం వల్ల 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 22 మంది గాయాలతో బయటపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వంతో స్పందించి ఎక్స్‌గ్రేషియా మంజూరు చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. వారి కుటుంబ సభ్యులకు ఇప్పుడు 6 చెక్కులు ఇవ్వడం జరిగింది. సాయంత్రం ముగ్గురికి మచిలీపట్నంలో చెక్కులు అందిస్తాం. మరొకరు గర్భిణీ కావడంతో కలెక్టర్ వారి ఇంటికి వెళ్లి చెక్కు అందజేస్తారని తెలిపారు.