చర్చలు.. లేవు నిర్ణయాలే..!

Power-tariff-hike-without-Pవిద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వానికి స్వపక్షం నుంచే విమర్శలు ఎదురవుతున్నాయి. కేంద్ర మంత్రి చిరంజీవి అనుచరుడు గా పేరొందిన మంత్రి సి. రామచంద్రయ్య విద్యుత్ ఛార్జీల పెంపుపై మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై ఏకపక్ష నిర్ణయాలు తగవని, ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకునే ముందు పార్టీలో అందరితో చర్చించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. సమన్వయ కమిటీఉన్నప్పటికినీ.. దాని మాత్రం ఉద్దేశం నెరవేరడం లేదని.. పెంపును సమర్థించుకునేందుకు నాలుగు మాటలు చెబితే ప్రజలు నమ్ముతారనుకుంటే భ్రమపడినట్లేనని ఆయన అన్నారు. 2004 లో తెదేపా కూడా ఇలాగే అధికారం పోవాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఇక నుండైనా.. ఏదైనా ముఖ్యమైన అంశాలలో నిర్ణయం తీసుకునే ముందు.. సీఎం పార్టీలో అందరితో చర్చిస్తే మంచిదని రామచంద్రయ్య సూచించారు.