Site icon TeluguMirchi.com

పోస్టల్ బ్యాలెట్ లకు ఎటువంటి చార్జీలు లేవు

జిహెచ్ఎంసి ఎన్నికలకు గాను పోస్టల్ బ్యాలెట్ ను పంపే ఓటర్లకు పోస్టల్ చార్జీలను జిహెచ్ఎంసి చెల్లిస్తుందని జిహెచ్ఎంసి ఎన్నికల అధికారి తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, సర్వీస్ ఓటర్లు, దివ్యాంగ, 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు, కోవిడ్-19 పాజిటీవ్ ఉన్న ఓటర్లు తమ పోస్టల్ బ్యాలెట్ కవర్లను రిటర్నింగ్ అధికారికి సమర్పించేందుకు ఏవిధమైన పోస్టల్ స్టాంప్ లు ఉపయోగించాల్సిన అవసరం లేదని తెలిపారు. పోస్టల్ శాఖకు బి.ఎన్.పి.ఎల్ అకౌంట్ నెంబర్ 2019 కస్టమర్ ఐ.డి 6000014601 అనే నెంబర్ ద్వారా జిహెచ్ఎంసి పోస్టల్ వ్యయాన్ని చెల్లిస్తుందని అన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఉన్న ఎన్వెలప్  (లిఫాప) పై బి.ఎన్.పి.ఎల్ అకౌంట్ నెంబర్, కస్టమర్ ఐడి నెంబర్లను రాయాల్సి ఉంటుందని తెలిపారు.

Exit mobile version