Site icon TeluguMirchi.com

లోకేష్ పై పోసాని సటైర్ !

lokesh
ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురఌ ఓపెన్ మైండ్ గురించి తెలిసిందే. ఆయన్ని కదిలిస్తే షాక్ కొట్టే మాటలు బయటికొస్తాయి. తాజాగా, ‘ధృవ’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లోనూ పోసాని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. వారసత్వం నిలబెట్టుకోవడం అంతా ఈజీ కాదనే విషయాన్ని చెప్పడానికి ఉదాహరణగా ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా విచ్చేసిన తెలంగాణ మంత్రి కేటీఆర్ ని తీసుకొన్నారు పోసాని.

కేటీఆర్ గొప్పొడు. ఆయన తండ్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా గొప్పోడు. అయితే, కేసీఆర్ గొప్పొడు కావడం వల్ల కేటీఆర్ గొప్పొడు కాలేదు. కష్టపడ్డాడు.. విదేశాల్లో ఉన్నత విద్యలు అభ్యసించారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడి పనిచేసి.. రాజకీయాలపై, తెలంగాణ అభివృద్ధిపై తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు చరణ్ కూడా అంతే. తండ్రి మెగాస్టార్ కదా అని చేతులు కట్టుకొని కూర్చోలేదు. కష్టపడి పని చేశాడు.

ఇక, ముఖ్యమంత్రుల కొడుకలంతా కేటీఆర్ లా కాలేదు. ఏమీ కానీ వాళ్లు కూడా ఉన్నారంటూ ఓ కామెంట్ చేశారు. ఇప్పుడీ కామెంట్ పై తెలుగు తముళ్లు ఫైర్ అవుతున్నారు. ఆ మాట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ యువనేత లోకేష్ ని ఉద్దేశించి అన్నారని లోలోపల పోసానిపై మండిపడుతున్నారు. ఇలాంటి కామెంట్స్ వినిపించకుండా లోకేష్ ని వెంటనే ఏపీ కెబినేట్ లోకి తీసుకోవాలని.. అధినేత చంద్రబాబుపై మరింత ఒత్తిడి తీసుకురావాలని తెలుగు తమ్ముళ్లు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

మొత్తానికి.. పోసాని చేసిన ఓ కామెంట్ లోకేష్ ని మరింత తొందరగా మంత్రి పదవిని తీసుకొచ్చేలా ఉందంటున్నారు.

Exit mobile version