క్యాలెండర్ కోసం సైనికులతో ఫోటోలకి ఫోజులిచ్చిన పోర్న్ స్టార్


ఒక క్యాలెండర్ కోసం 12 మంది సైనికులను సెలక్ట్ చేసారు. వారంతా యుద్ధంలో గాయపడిన సైనికులు. వీరితో ఒక ఫోటో షూట్ చేశారు. చారిటీ కోసం నిర్వహించే ఈ ఫోటో షూట్ ఉక్రెయిన్ లో జరిగింది. ఈ షూట్ లో ఉక్రేనియన్ అడల్ట్ ఫిల్మ్ స్టార్ యులియా సెనియుక్ పాల్గొనడం వార్తల్లోకెక్కింది.

ఉక్రేనియన్ థియేటర్లో క్యాలెండర్ ఫోటో షూట్ జరిగింది. ఈ ఫోటో షూట్ లో 28 ఏళ్ల సెనియుక్ పాల్గొన్నారు. ఆమెను తెరపై జోసెఫిన్ జాక్సన్ గా పిలుస్తారు. ఈ పోర్న్ నటి గాయపడిన సైనికులతో క్యాలండర్ కి ఫోజులిచ్చారు. ఈ సైనికులంతా రష్యాకు వ్యతిరేకంగా పోరాటం చేసి అవయవాలు కోల్పోయినవారు. ఈ ఫోటో షూట్ ద్వారా వచ్చిన మొత్తాన్ని గాయపడిన.. ఇతర యోధుల పునరావాసం కోసం వినియోగిస్తారట.

ఇక ఈ ఫోటో షూట్ లో సైనికులంతా సూట్లు, టైలు, టక్సేడోలు ధరించారు. యులికా సెనియుక్ 2019 లో 23 సంవత్సరాల వయసులో జోసెఫిన్ జాక్సన్ గా పేరు మార్చుకుని పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 2021 లో ఉక్రెనియన్ కామెడీ మిని సిరీస్ పోర్న్, ఐ లవ్ యు చిత్రాల్లో నటించారు. ఉక్రెయిన్ పోర్న్ హబ్ లో అత్యధిక గుర్తింపు ఉన్న రెండవ పోర్న్ నటి కూడా ఈమెనె.