వాయిదాకే పార్టీల ఓటు!!

zptc-mptc-electionsజడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని సీపీఎం తప్ప అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల కమిషన్ కి విజ్ఞప్తి చేశాయి. నిన్న (గురువారం) రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. సాధారణ ఎన్నికలు, పదో తరగతి పరీక్షలు, సిబ్బంది కోరత.. తదితర కారణాల చేత పురపాలక,జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేయాలని పొలిటికల్ పార్టీలు కోరాయి. రాజకీయ పార్టీలు వెలుబుచ్చిన అభిప్రాయాలను నేడు ఎన్నికల కమిషన్ సీప్రీం కోర్టు ముందుకు తీసుకుపోనుంది. ఈ నేపథ్యంలో.. సుప్రీం నేడు వెలువరించే తీర్పుపైనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఆధారపడి వుంటుంది.