ఇటు దూసే కత్తులు – అటు పొడిచే పొత్తులు !

upa-ndaదూసే కత్తులు ఒకవైపు.. పొడిచే పొత్తులు మరో వైపు. ఎన్నికల నగారా మోగింది మొదలు.. తెలంగాణలో కొత్త రాజకీయ ఎత్తుగడలు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరవుతారో.. ?? అనే విషయం పక్కన పెడితే… నిన్నమొన్నటి వరకు మిత్ర పక్షాలుగా మెలిగిన కాంగ్రెస్, తెరాసలు కత్తులు దూసుకుంటున్నాయి.

మరోవైపు, తెదేపా, భాజాపా, పవన్ కళ్యాన్ జనసేన, లోక్ సత్తా పొత్తులకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలొస్తున్నాయి. ఈ కలయిక నిజమైతే ఎన్నికల ముఖచిత్రం మారిపోవచ్చు. ఈ నాలుగు పార్టీలు ముప్పేటా దాడితో ప్రత్యర్ధులు మూడు చెరువుల నీళ్లు తాగిస్తాయా? గుండెలదిరే ఫలితాలు వస్తాయా? ఎక్కడ నలుగురు చేరినా ఇదే చర్చ.

పవన్ కల్యాణ్ బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీతో చర్చలు జరపనున్నట్టు తెలుస్తోంది. అవినీతి నినాదంతో తన పార్టీని ప్రజల ముందుకు తీసుకువెళ్లాలన్నది పవన్ వ్యూహం. పవన్ వ్యూహంతో.. అవినీతిపార్టీల ఆశలు గల్లతైయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి వేసవిలో రాష్ట్రంలో హాట్ రాజకీయాలకు తెరలేచింది.