Site icon TeluguMirchi.com

పాక్ ఆందోళనలు : సచివాలయం గేట్లు ధ్వంసం

PAK-Agitations
పాకిస్థాన్ లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. తెహ్రికే ఏ ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్, మత పెద్ద ఖాద్రీ నేతృత్వంలో నిరసనకారులు ఆందోళనను ఉధృతం చేశారు. ఇస్లామాబాద్ లోని సచివాలయ గేట్లను ఆందోళన కారులు ధ్వంసం చేశారు. సచివాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన నిరసన కారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన ఆందోళన కారులు పోలీసులపై రాళ్ల వర్షం కురిపించారు. వారిని నిలువరించడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ నిర్వహించారు. దీంతో పలువురు గాయపడ్డారు.

మరోవైపు, పాక్ తో చర్చలు జరిపేది లేదని భారత్ స్పష్టం చేసింది. వచ్చే నెలలో నేపాల్ లో సార్క్ దేశాల సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా.. పాక్ తో కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చర్చలు జరపబోతున్నారంటూ వస్తున్న వార్తలను హోంమంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఈ మేరకు ఆ శాఖ కార్యాలయం ట్వీట్ చేసింది. “పాక్ తీవ్రవాదాన్ని ఆపనంతవరకు ఎలాంటి చర్చలు సాధ్యం కావు” అని పేర్కొంది. కాగా, సెప్టెంబర్ 18, 19న నేపాల్లో జరగనున్న సార్క్ సమావేశాలకు కేంద్ర హోం శాఖ మంత్రి హాజరుకానున్న విషయం తెలిసిందే.

Exit mobile version