నిన్న సోనియా.. నేడు కేసీఆర్.. !!

kcr-and-soniaరాష్ట్ర విభజన ఖరారైంది. భజనలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని తెలంగాణ దేవతగా అభివర్ణిస్తూ.. టీ-నేతల పూజలు-పురస్కారాలు కొనసాగుతున్నాయి. సీమాంధ్రలోనూ సోనియాకు పురస్కారాలు జరుగుతున్నాయి. అవి మరో రకం పూజలు లేండీ. భజనలు చేయడంలో నేతలు ముందుంటే.. వాటిని హైలైట్ చేయడంలో మీడియా మరింత ముందుంది.

ఆరాధిస్తూనో, అసహించుకుంటూనో.. నేతలు, మీడియా నిన్నటి వరకు సోనియా జపం చేశాయి. తాజాగా కేసీఆర్  భజనను భుజాన వేసుకొన్నాయి. కేసీఆర్ ని తెలంగాణ గాంధీ గా పేర్కొంటూ.. లేనిపోని హడావిడి చేస్తోంది. ఢిల్లీ నుంచి కేసీఆర్ హైదరాబాద్ కు తిరిగొస్తున్న నేపథ్యంలో.. మీడియా మొత్తం అటు వైపు దృష్టిసారించింది. ఇక తెరాస తమ్ముళ్ల హడావుడి అంతా.. ఇంతా కాదు. విజయయాత్రతో హైదరాబాద్ ను హడలించేస్తామన్న లెవల్ లో బిల్డప్ లు ఇస్తున్నారు.

భజనలు ఎలా వున్నా.. కేసీఆర్ విజయయాత్ర పుణ్యమా అని భాగ్యనగరం వాసులకు కష్టాలు తప్పేలా లేవు. కేసీఆర్ రాక కారణంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు మరీ. ఇదంతా జాగ్రత్తగా గమనించిన వారు ఇది భజన కాలమని అభివర్ణిస్తున్నారు. ముందు ముందు ఇంకెన్ని భజనలు చూడాల్సి వస్తుందో. ప్రస్తుతానికైతే.. కేసీఆర్ భజన కొనసాగుతోంది. మరీ.. నెక్ట్స్ ఎవరు..?? ఏ చిరంజీవినో, ఏ అమ్మ భక్తుడో అవకపోతాడా.. ! వెయిట్ అండ్ సీ..