పోలింగ్ బూత్ లో నిద్రపోయిన సిబ్బంది

మంగళవారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకూ సాగింది. అయితే ఈసారి కూడా పోలింగ్ శాతం భారీగా పడిపోయింది. ఏ ప్రాంతం లో కూడా పూర్తి స్థాయి లో ఓట్లు వేయలేదు.

కాగా హైదరాబాద్ పాతబస్తీ యాకుత్‌పురా తలాబ్ చంచలంలో 44వేల 969మంద ఓటర్లు ఉన్నారు. కానీ మధ్యాహ్నం దాటినా ఓటు వేసేందుకు మాత్రం కేవలం 332మంది మాత్రమే వచ్చారు. అంటే అక్కడున్న ఓటర్లలో ఒక్క శాతం మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. దీంతో ఆయా పోలింగ్ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది ఓటర్లు లేక పనిలేక.. ప్రశాంతంగా తామ పనిచేయాల్సిన బల్లలపైనే పడుకున్నారు.