ప్రజలకు ఎప్పుడు ఏ ఆపద వచ్చిన టక్కున వచ్చి వారిని రక్షించాల్సిన పోలీసులు..డ్యూటీ లో ఫుల్ గా మద్యం సేవించి డైరెక్ట్ గా ఎస్పీ కి దొరికి సస్పెండ్ అయ్యారు. ఈ ఘటన సూర్యాపేట లో చోటు చేసుకుంది.
సూర్యాపేట జిల్లాలో మద్యం సేవించి విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డ్ ను ఎస్పీ భాస్కరన్ సస్పెండ్ చేశారు. శుక్రవారం రాత్రి ఎస్పీ భాస్కరన్ పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ ను అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో కానిస్టేబుళ్లు, హోంగార్డు అతిగా మద్యం సేవించారని తేలడంతో ముగ్గురు పోలీస్ సిబ్బందిని ఎస్పీ భాస్కరన్ సస్పెండ్ చేశారు.