తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జీ

లాక్ డౌన్ దెబ్బకు వలస కూలీలా బ్రతుకులు చిందరవందర అయ్యాయి. బ్రతుకు దెరువు కోసం వారి సొంత ఊర్లను వదిలిపెట్టి నగరానికి వస్తే ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా పనులు లేకపోవడం తో వారి జీవనం దారుణమైంది. ఇలా ఎన్ని రోజులు ఇలా ఉంటామని సొంతర్లకు పయనం అయ్యారు. నడకదారిని కొంతమంది సైకిళ్ళ ఫై కొంతమంది ఎలా ఎవరికీ తోచినట్లు వారు వెళ్తున్నారు.

అయితే తాడేపల్లిలో వలస కూలీలపై పోలీసులు లాఠీ చార్జీ చేయడం తో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. తిండిలేక పట్టణంలో బతకలేక ఇంటిదారి పట్టిన వలసకూలీలను రోడ్లపై పరుగులు పెట్టించారు పోలీసులు. ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన వెయ్యి మంది వలస కూలీలను తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించారు. వారంతా నడుచుకుంటూ స్వస్థలాలకు పయనం అవగా, అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ఏపీ సీఎస్ నీలం సాహ్ని వారిని చూసి ఆగి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని, అక్కడి నుంచి స్వస్థలాలకు పంపాలని ఆదేశించారు. సీఎస్ ఆదేశాలతో వలస కూలీలందరినీ అధికారులు తాడేపల్లిలోని విజయవాడ క్లబ్‌కు తరలించగా.. ఉదయం వారందరికీ అల్పాహారం అందజేవారు. ఈ క్రమంలోనే సైకిళ్లపై వచ్చిన దాదాపు 150 మంది కూలీలు టిఫిన్ చేసి తిరుగుముఖం పట్టారు. వీరంతా విజయవాడ కనకదుర్గమ్మ వారధి వద్దకు చేరుకోగానే పోలీసులు చూసి అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. దీంతో కూలీలు భయంతో రోడ్లపై పరుగులు తీశారు.