పవన్‌ కల్యాణ్‌పై పోలీస్ కేసు

పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారని పులివెందుల మున్సిపల్‌ చైర్మన్‌ వరప్రసాద్, కౌన్సిలర్లు, వైఎస్సార్‌సీపీ నాయకులు పులివెందుల అర్బన్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ గోపీనాథ్‌కు ఫిర్యాదు చేశారు.

పులివెందుల గడ్డ అంటేనే ప్రేమ, అభిమానాలకు, పౌరుషానికి పుట్టినిల్లు. ఇద్దరు మంచి ముఖ్యమంత్రులను ఈ ప్రాంత ప్రజలు అందించారు. టీడీపీ, బీజేపీ ఇచ్చే ప్యాకేజీలకు అమ్ముడుపోయిన పవన్‌ కల్యాణ్‌కు పులివెందుల ప్రజల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. పులివెందుల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్‌ కల్యాణ్‌ పులివెందుల ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని పులివెందుల మున్సిపల్‌ చైర్మన్, వరప్రసాద్ డిమాండ్ చేసారు.