పోలవరం ముంపు బాధితులకు భరోసా ఇచ్చే క్రమంలో ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాలుగు ముంపు మండలాలతో రెవిన్యూ డివిజన్ ఏర్పాటు ఉంటుందని తెలిపారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి రూ.20 వేల కోట్లు అవసరం. ఆ ప్యాకేజీ కోసం కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నాం. వెయ్యి కోట్లో, రెండు వేల కోట్లో అయితే మేమే ఇచ్చేవాళ్లం. అంత కాబట్టే కేంద్రం సాయం చేయాల్సిందే. పోలవరం పునరావాసం అంతా కేంద్రం చేతుల్లోనే ఉంది. ఆ సాయం కోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నాం. సెప్టెంబర్‌లోగా పోలవరం నిర్వాసితులకు పరిహారం అందేలా చూస్తాం. పూర్తి పరిహారం ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు నింపుతాం. ఏ ఒక్కరికీ అన్యాయం జరగనీయం అని సీఎం జగన్ పేర్కొన్నారు.