అసోంలోని బస్కా జిల్లా తముల్‌పూర్‌లో బహిరంగసభలో ప్రధానమంత్రి మోదీ ప్రసంగిస్తున్న సమయంలో జనాల్లో ఉన్న కార్యకర్త హరిచరణ్ దాస్ ఎండలకు తాళలేక వడదెబ్బ తగిలింది. దీంతో కార్యకర్త సొమ్మసిల్లి పడడంతో జనాల్లో కలకలం మొదలైంది. ఈ విషయాన్ని గమనించిన ప్రధాని మోదీ వెంటనే ప్రసంగం ఆపేశారు. అనంతరం తన వైద్య బృందాన్ని అతడికి వైద్యం చేయాలని పంపించారు. వెంటనే ప్రధానమంత్రి వైద్య బృందం హరిచరణ్ దాస్ వద్దకు వెళ్లి వైద్యం అందించారు. అతడి ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. అనంతరం ప్రధాని ప్రసంగం కొనసాగించారు.