Site icon TeluguMirchi.com

ఏడ‌వ అంత‌ర్జాతీయ యోగా దినోత్సవంలో ప్ర‌సంగించ‌నున్న ప్రధాని మోడీ

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రేపు, అంటే జూన్ 21 వ తేదీ ఉద‌యం 6.30 గంట‌ల‌కు ఏడ‌వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించ‌నున్నారు

ఇందుకు సంబంధించి ట్విట్ట‌ర్ ద్వారా ఆయ‌న ఒక సందేశం ఇస్తూ, జూన్ 21 వ‌తేదీ ఏడ‌వ అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకుంటాం. ఈ సంవ‌త్య‌రం ఇతివృత్తం యోగా ఫ‌ర్ వెల్‌నెస్‌. ఇది శారీర‌క‌, మాన‌సిక ఆరోగ్యానికి యోగాభ్యాసంపై దృష్టి పెడుతుంది. రేపు ఉద‌యం 6.30 గంట‌ల‌కు యోగా దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించ‌నున్నాను, అని పేర్కొన్నారు.

Exit mobile version