ఉగ్ర ముఠాలకు నిధులను నిరోధించే అంశంపై ఢిల్లీ వేదికగా ‘నో మనీ ఫర్ టెర్రర్’ అంతర్జాతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఉగ్రదాడి ఏ ప్రాంతంలో జరిగినా.. ఏ స్థాయిలో ఉన్నా ప్రతిస్పందన మాత్రం తీవ్రంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఉగ్రదాడులు జరిగేదాకా ఎదురుచూడటం సరికాదని, మనమే వారిని వెంబడించి మట్టుబెట్టాలన్నారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేంతవరకూ తమ ప్రభుత్వం విశ్రాంతి తీసుకోబోదని తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా యావత్ ప్రపంచం ఏకమవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.