ప్ర‌ధాన మోదీతో భేటీ అయిన సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి

ప్ర‌ధాన మోదీతో సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ హర్హాన్ ఈ రోజున సమావేశమయ్యారు. ఉభయ దేశాల మధ్య ఏర్పాటైన వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు సహా ప్రస్తుతం అమలవుతున్న ద్వైపాక్షిక కార్యక్రమాల పురోగతిని వీరి సమావేశం సమీక్షించింది. శక్తి, IT, రక్షణ సంబంధి తయారీ వంటి కీలక రంగాలతో పాటు మరిన్ని రంగాలలో సౌదీ నుంచి పెట్టుబడిని అందుకోవాలని భారతదేశం ఆసక్తితో ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అఫ్గానిస్తాన్లో స్థితి సహా ప్రాంతీయ పరిణామాల విషయం లో పరస్పర దృష్టికోణాల ను కూడా ఈ సమావేశం లో వెల్లడి చేసుకోవడం జరిగింది.