అవినీతిపై తమ ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. గుజరాత్ లోని కేవడియాలో జరిగిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ సంయుక్త సమావేశంలో ప్రధాని వర్చువల్ గా ప్రసంగించారు. గడిచిన ఆరేడు సంవత్సరాల్లో నిరంతర ప్రయత్నాల ద్వారా, తమ ప్రభుత్వం దేశంలో పెరుగుతున్న అవినీతిని అరికట్టడం సాధ్యమవుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించగలిగిందని ప్రధాని మోదీ వెల్లడించారు. మధ్యవర్తులు లేకుండా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందవచ్చని దేశం విశ్వసిస్తోందని తెలిపారు. దేశాన్ని మోసం చేసేవారు, పేదలను దోచుకునే వారు ఎంతటి శక్తిమంతులైనప్పటికీ తమ ప్రభుత్వం విడిచిపెట్టబోదని ప్రధానమంత్రి హెచ్చరించారు.