దేశంలోని పేద ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ కింద.. 2020, ఏప్రిల్–నవంబర్ కాలానికిగాను 2013, జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని లబ్ధిదారులందరికీ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజనను ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని సుమారు 80కోట్ల మంది లబ్ధిదారులకు ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు 8 నెలలపాటు 5 కిలోల ఆహార ధాన్యాలను(గోధుమలు లేదా బియ్యం) ఉచితంగా కేటయించారు. కోవిడ్–19 సంక్షోభం కారణంగా ఆర్థికంగా నష్టపోయిన పేదలకు, అణగారిన వర్గాలకు ఆహార భద్రతపై కల్పిస్తున్నారు.
2021లోనూ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోయిన కారణంగా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజనను కొంతకాలం.. అంటే 2021, మే నుంచి 2021, జూన్.. రెండు నెలల కాలానికి రూ. 26,602 కోట్ల రూపాయలతో గతసంవత్సరలో అమలు చేసినట్లుగానే ఈ ఏడాది కూడా అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని సుమారు 80కోట్ల మంది లబ్ధిదారులు మే, జూన్ 2021… రెండునెలలపాటు అదనంగా ఐదు కిలోల ఆహార ధాన్యాలు(బియ్యం లేదా గోధుమలు) పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కోవిడ్ 19 మహమ్మారి పరిస్థితిని సమీక్షించి, సంక్షోభ సమయంలో పేదలు, అవసరార్థులకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 7, 2021లో జాతినుద్ధేశించి చేసిన ప్రసంగంలో.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజనను 2021, నవంబర్లో వచ్చే దీపావళి వరకు .. ఐదు నెలలపాటు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలోని జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని సుమారు 80కోట్ల లబ్ధిదారులకు అదనంగా 5 కిలోల ఆహార ధాన్యాలు(బియ్యం లేదా గోధుమలు)ను అందజేస్తారు. రూ.67,266 కోట్ల అంచనా వ్యవయంతో 204 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తారు. జాతీయ ఆహార భద్రతా చట్టం పరిధిలోని లబ్ధిదారులకు అందజేసే నెలవారీ కేటాయింపులకు ఇది అదనం. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్నయోజన కింద జరుపుతున్న ఈ అదనపు కేటాయింపు ఖర్చును.. అంతర్రాష్ట్రీయ రవాణా, డీలర్ల మార్జిన్సహా మొత్తం వ్యయాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పంచుకోకుండా మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.