ప్రధాని ’కాల్’ చేశాడు.. !

cm-kiran-damodar-narasima-bరాష్ట్ర విభజన విషయంలో.. డిల్లీలో పరిణామాలు వేగంగా కదులుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఒకపక్క ఢిల్లీలో పార్టీ సమన్వయ సమావేశం జరుగుతుండగానే.. మరోపక్క శనివారం 10.30నిమిషాలకు ప్రధానితో సమావేశానికి హాజరుకావాలంటూ.. ప్రధాని కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్య నేతలకు కబురు అందింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణలకు ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వచ్చిన వారిలో వున్నారు. అయితే, ఇప్పటివరకు విభజన విషయంలో.. ప్రధాని మన్మోహన్ పెద్దగా జోక్యం చేసుకోలేదనే చెప్పాలి. ఈ విషయాన్ని అధినేత్రి
సోనియా గాంధీ, షిండే, దిగ్విజయ్.. తదితరులు మాత్రమే వదిలేశారు. అయితే, ఇప్పుడు విభజన ఘట్టం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో.. రాష్ట్ర ముఖ్యనేతలకు.. ముఖ్యంగా త్రిమూర్తులకు స్పష్టమైన అభిప్రాయాలు చెప్పడానికే ప్రధాని వీరితో సమావేశం కావాలని భావించి వుండవచ్చునని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.