విభజన నిర్ణయం మార్చుకోక తప్పదు!

mp anamtaరాష్ట్ర విభజన నిర్ణయాన్ని అధిష్ఠానం మార్చుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు ఆ పార్టీ సీమాంధ్ర ప్రాంత ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి. విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము చేసిన రాజీనామాలపై వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని, వాటిని ఆమోదింపజేసుకుంటామని ఢిల్లీలో మీడియాతో అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంతో సీమాంధ్రలో పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందని. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం ప్రకారం ఎవరైనా తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సిందేనన్నారు. తెలంగాణ నేతలు రెచ్చగొట్టేలా దూషిస్తున్నారని అన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనతో ఏర్పడ్డ సంక్షోభానికి కేంద్రమే పుల్ స్టాప్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ సీమాంధ్రులది కాదనే నైతిక హక్కు ఎవరికీ లేదన్నారు. రాష్ట్రాన్ని విభజించటానికి వీల్లేదని…. అన్యాయానికి గురవుతాం కాబట్టే… విభజనను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.