గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఇంధన ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు శనివారం సాయంత్రం వెల్లడించింది. పెట్రోల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ ₹8, డీజిల్ పై ₹. 6 తగ్గిస్తున్నట్లు తెలిపింది. తద్వారా పెట్రోల్ పై లీటర్‌కు ₹. 9.5, డీజిల్‌పై ₹.7 తగ్గుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అంతేకాకుండా పీఎం ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న లబ్ధిదారులకు సిలిండర్ పై ₹.200 సబ్సిడీని ప్రకటించింది. ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ వర్తిస్తుందని తెలిపింది. ఇదిలా ఉండగా.. దేశంలో ఉజ్జ్వల యోజన కింద 9 కోట్ల కనెక్షన్స్ ఉన్నాయి, వారందరికీ ఈ రాయితీ ద్వారా ప్రయోజనం కలుగుతుంది.