’టీ’పై సుప్రీంలో పిటిషన్!!

pill-on-telangana-billరాష్ట్ర విభజనను ఆపేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్నారు సమైక్య నేతలు. తాజాగా, విభజన ప్రక్రియ ఆపాలంటూ.. నేతలు రఘురామ కృష్ణంరాజు, అడుసుమిల్లి జయప్రకాష్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బిల్లును వ్యతిరేకిస్తూ.. రాష్ట్ర శాసనసభ తీర్మాణం చేసినా.. కేంద్రం పార్లమెంట్ లో విభజన బిల్లు పెట్టేందుకు సిద్ధమైందని వారు ఆరోపించారు.

టీ-బిల్లుపై అసరమైతే న్యాయపోరాటం చేస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, మరికొందరు సీమాంధ్ర నేతలు కూడా ’టీ’పై సుప్రీం గడప తొక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరోవైపు, విభజన విషయంలో జోక్యం చేసుకోవాలని దాఖలైన 3 పిటిషన్ల విచారణను సుప్రీం ఈ నెల 7వ తేదికి వాయిదా వేసింది.