‘అపాయింటెండ్ డే’ పై కేంద్రానిదే బాధ్యత

divisin
రాష్ర్ట విభజన అంశానికి సంబంధించి అపాయింటెడ్ డే జూన్ 2గా వుంటే రాజ్యాంగ సంక్షోభం ఎదురవుతుందని, అలా జరగకుండా వుండేందుకు ఇంకొంత ముందుగానే అంటే 17వ తేదీనే అపాయింటెడ్ డేగా ప్రకటించాలని కోరుతూ టీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టులో వాదనలు ముగిశాయి. అపాయింటెడ్ డేను ముందుకు జరపాలని ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది చేసిన వాదనను న్యాయస్థానం అంగీకరించింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించింది. అంతేకాక అపాయింటెడ్ డేపై జూన్ 2 కాకుండా మే 16న ప్రకటించాలని కోరడంపై పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.