ప్రజలు కాంగ్రెస్ పై ఆగ్రహం తో ఉన్నారు : సోనియా

soniaఎన్నికల ఫలితాల నేపధ్యం లో కాంగ్రెస్ పార్టీ లోతైగా ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తో కలసి ఆమె మీడియా తో మాట్లాడారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారనే విషయం ఈ ఎన్నికల పలితాలు తేలిందన్న సోనియా సాధారణ ఎన్నికలకు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు వ్యత్యాసం ఉందన్నారు.  ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. సరైన సమయంలో ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పారు.
rahulప్రజల అంచనాల మేరకు మా ప్రభుత్వాలు పని చేయలేదు: రాహుల్   

ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం నేర్పాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ప్రజలతో కలసి పని చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయిందని చెప్పారు. ప్రజల అంచనాల మేరకు తమ ప్రభుత్వాలు పనిచేయలేదని అన్నారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ నేతల్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. పార్టీని ఏకతాటిపై నడిపిస్తామని చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలతో మమేకమై పని చేసిందని… దాంతో ఆ పార్టీ తొలి ప్రయత్నంలోనే మెరుగైన ఫలితాలను రాబట్టుకోగలిగిందని అభిప్రాయపడ్డారు.