2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికిన విషయం తెల్సిందే. పార్టీ పెట్టి పోటీకి అవకాశం ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను పోటీకి దించకుండా తెలుగు దేశం మరియు బీజేపీలకు మద్దతు తెలిపి ఆ పార్టీ తరపున ప్రచారం చేసిన విషయం తెల్సిందే. పవన్ మద్దతుతో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అత్యధిక స్థానాలు దక్కించుకుని సీఎం అయ్యాడు. పవన్ స్నేహంతో మోడీకి పెద్దగా లాభం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడుకు మాత్రం కలిసి వచ్చింది. అయితే ఎన్నికలు అయిన కొన్నాళ్లకే మోడీ మరియు చంద్రబాబు నాయుడులపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు.
పొత్తు విషయంలో త్వరలోనే పవన్ ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మోడీతో జరగబోయే భేటీ సామరస్య పూర్వకంగా, సానుకూల వాతావరణంలో జరిగితే తప్పకుండా 2019లో మళ్లీ బీజేపీకి పవన్ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి. ఎన్నికలకు ఇంకా సంవత్సరంకు పైగా ఉంది, ఈ లోపు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.