మరో వైపు జనసేన పార్టీ కార్యయం నుండి కూడా ఒక పత్రిక ప్రకటన విడుదల అయ్యింది. కత్తి మహేష్‌పై దాడి విషయంలో ఆ ప్రకటనలో స్పందించడం జరిగింది. పవన్ కళ్యాణ్ అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు ఓర్పుతో ఉండాలని, పార్టీని బలహీనం చేసేందుకు ఎవరైనా చేసే విమర్శలకు స్పందించక్కర్లేదు అంటూ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. దాంతో కత్తి మహేష్‌పై ఇక నుండి పవన్ ఫ్యాన్స్ మరియు జనసేన కార్యకర్తలు సైలెంట్‌గా ఉండే అవకాశం ఉంది.
ఇకపై అయినా ఈ వివాదంకు ఫుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి. కత్తి మహేష్ గత కొన్ని రోజులుగా తీవ్ర స్థాయిలో చేస్తున్న విమర్శలతో పవన్ ఫ్యాన్స్ రెచ్చి పోతున్నారు. కత్తి సైలెంట్ అయితే ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయ్యే అవకాశం ఉంది.